Woman Fires on Gummanur: "జయరాం అంట జయరాం.. ఏం చేశాడు.. నీరు కూడా ఇవ్వలేదు".. మంత్రిపై మహిళ ఫైర్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Woman Fires on Minister Jayaram: ఎన్నికలప్పుడు ఊరికొచ్చి.. ఓటేస్తే గ్రామంలో సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం.. ఇప్పుడు గుక్కెడు నీరు కూడా అందించడం లేదని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సొంత నియోజకవర్గమైన కర్నూలు జిల్లా ఆలూరులోని హాలహర్వి మజరా గ్రామమైన మాచనూరులో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గ్రామానికి నీరు సరఫరా చేయగా.. సక్రమంగా రాకపోవడంతో కుళాయి వద్ద అసభ్య పదజాలంతో మంత్రిని దూషించారు.
'జయరాం అంట జయరాం.. ఏం చేశాడు. నీరు కూడా ఇవ్వలేకపోతున్నాడు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆమె ఆవేశంతో ఊగిపోయారు. ఇంటింటికి కుళాయి అని చెప్పారని.. కనీసం గ్రామంలో ఉన్న వాటిల్లో నీరు రావడం లేదని వాపోయారు. వేసవి వచ్చిదంటే తాగు నీటి సమస్య నిత్యం వేధిస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. మహిళ తిట్టే దానిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామాల్లో పర్యటించి.. తాగునీటి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.