Woman kidnapped in Palnadu District పల్నాడు దారుణం.. అప్పు చెల్లించలేదని అర్ధరాత్రి మహిళ కిడ్నాప్.. పోలీసులు పట్టించుకోలేదని బాధితుల ఆందోళన - Woman kidnapped
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 3:42 PM IST
Woman kidnapped in Palnadu District: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులోని జగనన్న కాలనీలో ఓ మహిళ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో అయిదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసి మహిళను అపహరించుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అయిదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసి మహిళను అపహరించుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లో అలజడి సృష్టించి.. వస్తువులు ధ్వంసం చేసి తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాకీ తిరిగి ఇవ్వలేదనే తన కోడలు లక్ష్మీ ప్రణతిని దౌర్జన్యంగా అపహరించుకుపోయారని అత్త నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడి చేయడంతో తనకు, తన మనవడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టిచుకోలేదన్నారు. దుండగుల దాడిలో గాయాలై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోడలు ఆచూకీ తెలపి న్యాయం చేయాలంటూ నరసరావుపేట డీఎస్పీ కేవీ మహేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.