Protest to Tammineni Sitaram: నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో పో అంటూ మహిళపై ఊగిపోయిన స్పీకర్ - ap latest news
🎬 Watch Now: Feature Video
Woman Depose Speaker Tammineni Sitaram in Nelliparthi : 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం' చేపట్టిన వైఎస్సాసీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు నిరసన సెగలు గట్టిగానే తగులుతున్నాయి. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ఆగిపోయిన పథకాలు, గ్రామాల అభివృద్ధిపై జనం వారిని నిలదీస్తున్నారు. కొందిరిని పదవుల నుంచి అకారణంగా తీసి వేయడం లాంటి కార్యక్రమాలు చేయడంతో గడప గడపకు వచ్చిన ప్రజాప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సారి ఏకంగా సభాపతి తమ్మినేని సీతారాంను ఓ మహిళ ప్రశ్నించింది. కోపోద్రిక్తులైన సభాపతి ఆమె పై ఆగ్రహంతో ఊగిపోయారు.
నీ దిక్కున చోట చెప్పుకో : 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో' ప్రశ్నించిన ఓ మహిళపై సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహంతో ఊగిపోయారు. 'నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో పో ' అంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నెల్లిపర్తిలో స్పీకర్ తమ్మినేని సీతారాం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లిన సభాపతి టీడీపీ మాజీ ఎంపీటీసీ శెట్టి నర్సింగ్ రావు, ఆయన సోదరుడి ఇళ్లకు వెళ్లలేదు. దీంతో మాజీ ఎంపీటీసీ మరదలు శెట్టి పద్మ స్పీకర్ వద్దకు వెళ్లి అంగన్వాడీ కార్యకర్తగా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీంతో తమ్మినేని సీతారాం నీ దిక్కున చోట చెప్పుకో అంటూ వెళ్లి పోయారని ఆమె అన్నారు. సమస్యపై ప్రశ్నిస్తే సభాపతి ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆ మహిళ వాపోయారు.