Wife Caught Husband with Another Woman: వేరే మహిళతో భర్త.. గదిలో బంధించి పోలీసులకు సమాచారమిచ్చిన భార్య - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 3:39 PM IST
Wife Caught Husband with Another Woman: భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టి పోలీసులకు అప్పగించిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన తూంపాటి ప్రియాంకకు అదే గ్రామానికి చెందిన గాంధీతో 17 ఏళ్ల క్రితం వివాహం అయింది.. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే గాంధీ అదే గ్రామానికి చెందిన రమాదేవితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రమాదేవి కూడా ఆమె భర్త రమేష్‌తో గొడవలు పడి గత మూడు ఏళ్లుగా విడిగా ఉంటోంది. ప్రస్తుతం రమాదేవి జంగారెడ్డిగూడెంలో ఓ ఇల్లును అద్దెకి తీసుకుని తన బిడ్డతో ఉంటుంది. గాంధీ రోజు పనిలోకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి జంగారెడ్డిగూడెంలో రమాదేవి వద్దకు వెళుతున్నట్లు ప్రియాంకకు తెలియడంతో.. ఆమె తన బంధువులతో పాటు రమాదేవి భర్త రమేష్‌ను తీసుకుని వీరిద్దరు ఉన్న ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇద్దరూ లోపల ఉన్న సమయంలో తలుపుకు తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాంధీ, రమాదేవిలను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.