Wedding Stopped: ఆమె రాకతో పీటల మీదే ఆగిపోయిన వివాహం.. పోలీస్ స్టేషన్లో వరుడు - ఆగిపోయిన పెళ్లి వార్తలు
🎬 Watch Now: Feature Video
Wedding Stopped By First Wife: గుత్తి పట్టణంలోని ఓ వివాహం పీటల మీదే ఆగిపోయింది. మొదట వివాహం చేసుకున్న భార్య ఉండగానే వరుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య.. పెళ్లి మండపానికి చేరుకుని వివాహన్ని అడ్డుకుంది. అంతేకాకుండా ఆ యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన సుభాష్ కుమార్ అనే వ్యక్తికి 2020 సంవత్సరంలో.. అంబర్‌పేటకు చెందిన శిరీష అనే యువతితో వివాహం జరిగింది. అయితే వివాహమైన కొద్ది రోజుల్లోనే వారిద్దరి మధ్య వివాదాలు చెలరేగటంలో వారిద్దరూ.. విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శిరీష కాపురానికి రావటం లేదని.. సుభాష్ ఆమెకు విడాకుల నోటీసులు పంపించాడు. ఈ నోటీసులపై కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతుండగానే.. సుభాష్ గుత్తి పట్టణంలోని జెండా గేరుకు చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న శిరీష సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి వివాహాన్ని.. అడ్డుకుని వరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్య ఉండగానే మరో భార్యతో వివాహానికి సిద్ధమైనందుకు వివాహాన్ని నిలిపివేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. అబద్దాలు చెప్పి తనను మోసం చేశాడని.. ఏ ఒక్క విషయం కూడా నిజం చెప్పలేదని శిరీష ఆరోపించింది. మరోవైపు శిరీష తనతో ఎక్కువ కాలం కలిసి లేదని.. విడాకులు కావాలని కోరగా 50 లక్షల వరకు నగదు డిమాండ్ చేస్తోందని సుభాష్ ఆరోపిస్తున్నాడు.