Water Plant demolished: వైసీపీ ఆగడాలు.. వైఎస్సార్ విగ్రహం కోసం వాటర్ ప్లాంట్ కూల్చివేత
🎬 Watch Now: Feature Video
YCP leaders Demolished Water Plant: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకి శృతి మించిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న వాటర్ ప్లాంటును వైసీపీ నాయకులు పంచాయతీ సిబ్బందితో కలిసి కూలగొట్టారు. దీంతో స్థానికులు అక్కడకు చేరుకుని వాటర్ ప్లాంటును కూలగొడితే తమకు తాగునీరు ఎలా అంటూ ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి అందించే ఏకైక వాటర్ ప్లాంటును కూలగొట్టి విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు మరో చోటును ఎంపిక చేసుకోవాలని మహిళలు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ వాటర్ ప్లాంటును నిర్వహిస్తున్నారు. స్థానికులకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల స్వామి మద్దతు తెలిపారు. విషయాన్ని జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు.