Masthan Sai Case Updates : న్యూడ్ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి కేసులో ఇప్పటివరకు యువతులు, పలువురి వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన అధికారి ఓ యువతితో ఉన్న చిత్రాలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆ యువతే ఆర్‌జే శేఖర్ బాషాతోనూ కలిసి ఉంది. ఆ ఫొటోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నటుడు నిఖిల్ కూడా ఉన్నాడు.
బయటపడిన పోలీసు అధికారి ఫొటోలు : తనపై హత్యాయత్నం చేశాడని మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం యువతుల చిత్రాలు, ఆడియో కాల్స్ వరకే పరిమితమైనట్లు అంతా భావించారు. ఈ క్రమంలో పోలీసు అధికారి ఫొటోలు రావడం కలకలం రేపుతోంది. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేశారని సమాచారం.
ఆ అధికారితో అప్పట్లో ఓ యువతి చేసిన ఛాటింగ్‌లు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ కేసు విషయంలో ఆ యువతి 2022లో ఆయణ్ని కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి కొన్నాళ్లు ఛాటింగ్, వీడియో కాల్స్ నడిచినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఆ అధికారి తనను మోసం చేశాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో సహాయం చేస్తానని శేఖర్ బాషా ఆ యువతికి హామీ ఇచ్చి పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీడియోలు బయటకొచ్చాయి.
రంగంలోకి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో : నిందితుడు మస్తాన్ సాయి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఇటీవల వీడియోలు వెలుగులోకి రావడంతో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) రంగంలోకి దిగింది. పలు కోణాల్లో టీజీఏఎన్‌బీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విచారణ ప్రారంభించింది. సమాంతరంగా టీజీఏఎన్‌బీ ప్రత్యేక బృందం కూడా ఆరా తీస్తోంది. డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయించింది. నిందితుడు మాదాపూర్ కేంద్రంగానే మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు మస్తాన్ సాయిని ఏడు రోజుల కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో టీజీఏఎన్‌బీ మరింత లోతుగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
వందకు పైగా మహిళల వీడియోలు - మరోసారి కస్టడీకి మస్తాన్‌సాయి!
మస్తాన్ సాయి మనిషి కాదు - 'ఆ వీడియోల్లో ఎంతో మందికి డ్రగ్స్!' - MASTAN SAI AND LAVANYA DRUGS CASE