Water Level Decreasing in Thandava Reservoir: తాండవ జలాశయంలో క్రమేపీ తగ్గుతున్న నీటిమట్టం.. ఆందోళనలో రైతులు - నాతవరం తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 3:14 PM IST

Water Level Decreasing in Thandava Reservoir: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో నీటిమట్టం క్రమేపి తగ్గుతోంది. దీంతో ఖరీఫ్ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అన్నదాతల పరిస్థితి ప్రశ్నార్ధకమయ్యింది. కోతల దశ వచ్చేసరికి తమ పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జలాశయం కింద అనకాపల్లి జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, పాయకరావుపేటలతో పాటు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తుని, కోటనందూరు తదితర మండలాలకు చెందిన సుమారు 52 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్​కి సంబంధించి సగటున రోజుకి 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జలాశయంలో కొత్త నీరు చేరకపోవడంతో ఆయకట్టు దారుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 361.4 అడుగులు నీటిమట్టం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్లో ఉన్న నీటిమట్టం పరిశీలిస్తే ఈ నీరు నెలరోజుల వరకు మాత్రమే సరిపోతుందని.. ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటి అని రైతుల ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో వర్షాలు ఆశాజనకంగా పడకపోవడంతో పాటు ప్రస్తుత అక్టోబర్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండడం ప్రశ్నార్థకమవుతోంది. వర్షాలు పడే వరకు ఉన్న నీటిని పరిమితంగా వినియోగించుకోవాలని జలవనురుల శాఖ రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.