Vizianagaram Paidithalli Utsavalu: విజయనగరం పైడితల్లి ఉత్సవాలు ప్రారంభం.. పందిరాటతో అంకురార్పణ - AP Latest News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 1:10 PM IST
Vizianagaram Paidithalli Utsavalu: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా భావించే విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవానికి అంకుర్పారణ జరిగింది. ఈ నెల 30న తొలేళ్లు, 31న జరిగే సిరిమానోత్సవానికి పందిరాటతో మొదటి అడుగు పడింది. ఈ తంతు నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి చదరగుడి, వనంగుడి వద్ద ఆలయ పురోహితులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పైడితల్లి దేవస్థానం ఈవో సుధారాణి ఆధ్వర్యంలో పందిరాట కార్యక్రమంలో పుర ప్రముఖులు, ఆలయ కమిటీ పాలకవర్గంతో పాటు.. విజయనగరం కార్పొరేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. నేటితో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై.. నవంబర్ 17న ముగియునున్నాయి. ఈ ఉత్సవాల కోసం వేరే రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 30న జరిగే తొలేళ్లు, 31న సిరిమానోత్సవం ప్రధానమైనవని.. వీటి నిర్వహణకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఈవో, ఆలయపండితులు తెలియచేసారు.