Vizag Swetha Interview: పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న యవతి - ఏపీ యువతి జీవిత చరిత్ర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 10:32 PM IST
Vizag Swetha Interview: విదేశాల్లో చదువు కోసం ఎన్నో కలలుకంది తాను. అందుకు అవసరమైన పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి... స్కాలర్‌షిప్ సైతం అందుకుంది. తల్లిదండ్రులు సమకూర్చిన మిగిలిన మొత్తంతో యూకేలో విద్యను అభ్యసించడానికి వెళ్లింది. అయితే అనుకోని పరిస్థితిలో ఆసుపత్రి పాలైంది ఆ యువతి. పైగా అదే సమయంలో కరోనా.. ఇలా దెబ్బమీద దెబ్బ పడుతూ జీవితం తన ఆధీనంలో లేకుండా పోయింది. అయినా సరే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓ వైపు వైద్యం అందుకుంటూనే.. మరోవైపు చదువును కొనసాగించింది. ఫలితంగా మాస్టర్స్ పరీక్షల్లో డీన్ మెరిట్ సాధించింది విశాఖకు చెందిన శ్వేత. మరి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కోర్సును ఎలా పూర్తి చేసింది..? తన భవిష్యత్‌ను శ్వేత ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటుంది. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులకు అండగా ఉంటూనే.. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోన్న యువతి ప్రయాణం గురించి ఈటీవీ భారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం.