Visakha Simhachalam Appanna temple Hundi Income: విశాఖ సింహాచలం అప్పన్న హుండీ ఆదాయం రూ.2.01 కోట్లు - Visakhapatnam Telugu News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 10:52 AM IST
Visakha Simhachalam Appanna Temple Hundi Income : విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సింహగిరిపై ఈవో ఎస్. శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది హుండీ ఆదాయం లెక్కించారు. హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు సుమారు 2.01 కోట్లు సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. దీంతో పాటు 136 గ్రాముల బంగారం, 15.250 కిలోల వెండి లభ్యమైనట్లు వివరించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నాణేలు కూడా వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 35 రోజులదని తెలియజేశారు.
ఆర్జిత సేవలు పునః ప్రారంభం : సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన వార్షిక తిరు పవిత్రోత్సవాలు గురువారం దేవతామూర్తుల ఏకాంత స్నపనంతో సంప్రదాయబద్ధంగా పరిసమాప్తం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహించారు. గురువారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామికి ఏకాంతంగా స్నపనం నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు యథావిధిగా పునః ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.