పెచ్చులూడుతున్న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ - భయాందోళనలో నగరవాసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 4:44 PM IST

thumbnail

Vijayawada Kanaka Durga Flyover Damage: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వింగ్స్ మధ్య పెరుగుతున్న ఖాళీలు ప్రమాదకరంగా మారాయి. ఇలా ఏర్పడిన ఖాళీలను గతంలో తాత్కాలికంగా సిమెంట్‌ పూత వేసి వదిలేశారు. భారీ వాహనాల రద్దీ కారణంగా ఇప్పుడు ఆ ఖాళీలు మరింత పెరిగడం వలన.. సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో వంతెన కింద వెళ్లే వాహనదారులు, దుర్గ గుడికి వచ్చే భక్తులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో దుర్గ గుడి రిటైనింగ్‌ గోడ సమీపంలో సిమెంటు పెచ్చులు ఊడిపడటం వలన ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. 

ఇక ఇప్పుడు మరోసారి పెచ్చులు ఊడిపడుతుండటంతో.. వంతెన కింద రాకపోకలు సాగించే వాహనదారులు, దుర్గ గుడికి వెళ్లే భక్తులు భయాందోళనకు గురిఅవుతున్నారు. వర్షం పడినప్పుడు వంతెనపై నిలిచిన నీరు ఖాళీల ద్వారా కింద పడుతుంది. ఈ నేపథ్యంలో వంతెన వింగ్స్ పటిష్ఠతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.