పుస్తక ప్రియులకు గుడ్న్యూస్ - విజయవాడలో పుస్తక మహోత్సవం - పుస్తక మహోత్సవం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 5:36 PM IST
Vijayawada Book Festival 2023 : దేశంలో నిర్వహించే పుస్తక మహోత్సవాలకు దిల్లీ, కోల్‌కతా, కేరళ రాష్ట్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటికి ధీటుగా విజయవాడలో నిర్వహించే పుస్తక మహోత్సవం విశేష గుర్తింపు పొందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సాహిత్య అభిమానులు, పుస్తక ప్రియులు ఈ పుస్తక మహోత్సవానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. పుస్తక ప్రియులు ఎంతగానే ఎదురుచూసే ఆ రోజు వచ్చేసింది.
Vijayawada Book Festival 34th Edition Begin Today : గతంలో జనవరి మొదటి వారంలో ప్రారంభించే ఈ మహోత్సవాలను ఈసారి డిసెంబరు చివరి వారానికి మార్చారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్న పుస్తకాల పండుగ నూతన సంవత్సర వేడుకలకు ముందే రావటం చదువరులకు ఓ పెద్ద సంబరమే అని చెప్పవచ్చు. సాయంత్రం 6 గంటలకు లాంఛనంగా ప్రారంభం కాబోతున్న ఈ 34వ పుస్తక మహోత్సవం నిర్వాహణ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ అందిస్తారు.