TDP Varla Ramaiah on AP CID Chief Sanjay: సీఐడీ చీఫ్ సంజయ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య - ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై వర్ల రామయ్య కామెంట్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 5:55 PM IST

Varla Ramaiah on AP CID Chief Sanjay:  సీఐడీ చీఫ్ సంజయ్‌పై హైకోర్టు వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు నెలాఖరులో పోలీస్ హెడ్​క్వార్టర్స్‌పై ఏసీబీ దాడులు జరిగాయన్న వర్ల.. డీజీపీ కార్యాలయంలో ఏసీబీ సోదాల రిపోర్టును ముఖ్యమంత్రి బయట పెట్టగలరా అని నిలదీశారు. అధికారిగా కాకుండా అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించి హైదరాబాద్, దిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం సీఐడీ చీఫ్ సంజయ్‌కి ఏముందనీ ప్రశ్నించారు. ప్రభుత్వం సంజయ్​ను బెదిరించి పని చేపిస్తుందని ఆరోపించారు. పోలీసుల ప్రమోషన్ల వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని అన్నారు. దీనిలో సంజయ్ పాత్ర ఉన్నట్లు వినిపించిందని వర్ల రామయ్య చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దానిని అడ్డుపెట్టుకొని.. సంజయ్​తో బలవంతంగా చంద్రబాబును అరెస్టు చేపించారని వ్యాఖ్యానించారు. ఒకానొక సమయంలో సంజయ్ తనకు ఆ పదవి కూడా వద్దు అనుకున్నారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.