Forte Women Fellowship: కోటి రూపాయల స్కాలర్‌షిప్.. స్ఫూర్తిగా నిలుస్తున్న వైజాగ్ మహిళ - Forte Fellowship
🎬 Watch Now: Feature Video
Anusha Vadapalli Selected for Forte Fellowship: చాలామంది మహిళలు పెళ్లి, పిల్లలను తమ లక్ష్యాల సాధనకు అవరోధమనుకుంటారు. ఎన్నో సవాళ్లను అధిగమించి అటువంటి వారికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారు ఈ యువతి. అంతర్జాతీయ బిజినెస్ స్కూల్లో చదవాలన్న కలను సాకారం చేస్తున్నారు. లక్ష్య సాధనకు వైవాహిక జీవితం, పిల్లలు అడ్డంకి కాదని విశాఖకు చెందిన వాడపల్లి అనూష నిరూపించారు. సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా వాటి ముందు చిన్నదైపోతుందనడానికి ఆమె ఒక ఉదాహరణ. విదేశాల్లో ఎంబీఏ చేయాలనుకున్న ఆమెకు.. వరుస వైఫల్యాలు.. మరెన్నో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా సరే ఆమె ఓపిగ్గా విజయం కోసం ఎదురుచూసింది. ప్రసవమై ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే.. కోటి రూపాయల స్కాలర్‌షిప్ ఇంటర్వ్యూను పూర్తి చేసి.. అందులో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోని గొప్ప బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ బిజినెస్ ప్రోగ్రాం సీటు సాధించడమే కాకుండా కోటి రూపాయల స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈమె ప్రతిభను గుర్తించి ఫోర్టే ఉమెన్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.