Uyyala Ganapati Immersion నిమజ్జన ఊరేగింపులో ఈ బుజ్జి వినాయక ప్రతిమలు తీరే వేరయా! ఆకట్టుకున్న బుల్లి ట్రాలీ.. - చిన్న చిన్న ట్రాలీలో బుజ్జి గణపయ్య విగ్రహాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-09-2023/640-480-19629908-thumbnail-16x9-ganesh.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 4:32 PM IST
Uyyala Ganapati Immersion: కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో ఉయ్యాల గణపతి నిమజ్జన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. స్థానిక న్యాయవాది మొల్లేటి శ్రీనివాసరావు.. గణపతి విగ్రహాన్ని ఉయ్యాలలో వినాయక చవితి రోజున ప్రతిష్టించారు. బొమ్మల కొలువుతో ఏర్పాటు చేసిన ఉయ్యాల గణపతి ప్రతిమలు భక్తులను కనువిందు చేశాయి. కాగా.. ఉయ్యాల గణపతికి తొమ్మిది రోజులపాటు పూజలు చేసి.. బుధవారం రోజున ఉద్వాసన చేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చిన్న ట్రాలీలో బుజ్జి గణపయ్య విగ్రహాలను అమర్చి ఊరేగింపుగా నిమజ్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఉయ్యాల గణపయ్య ప్రతిమను ఎద్దుల బండి ఆకారంలో ఉన్న బొమ్మ బండిపై ఉంచి.. వెనుక మరో 30 ట్రాలీలు అమర్చి.. వాటిపై 30 చిన్నపాటి వినాయకుడి విగ్రహాలను ఉంచారు. చాకలిపాలెం నుంచి రాజోలు వరకు ఉయ్యాల గణపతి నిమజ్జన ర్యాలీ చేపట్టి.. అక్కడ బుధవారం రాత్రి బుజ్జి గణపయ్య ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఉయ్యాల గణపయ్య నిమజ్జన కార్యక్రమంలో చిన్న చిన్న ట్రాలీలో ఉన్న బుజ్జి వినాయకుడి చిన్న చిన్న ప్రతిమలు చూపరులను ఆకట్టుకున్నాయి. నేత్రపర్వంగా సాగిన ఉయ్యాల గణపయ్య నిమజ్జన ర్యాలీలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని తిలకించారు.