UTF Protest in Ap : సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు..
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 1:32 PM IST
UTF Protest in Adhraoradesh 2023 : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. అధికారంలో వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చి.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉపాధ్యాయులు మండిపడ్డారు. నెల్లూరులో మూడో రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు అభివృద్ధికి నోచుకోవటంలేదని విమర్శించారు
Teachers Nirasanalu on OPF : పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కడపలో యూటీఎఫ్ కార్యాలయంలో గత రెండు రోజుల నుంచి ఉపాధ్యాయులు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. దీక్ష చేస్తున్న నలుగురికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దీక్ష విరమించాలని పోలీసులు కోరడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు వారందరిని బలవంతంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి దీక్ష భగ్నం చేశారు.
AP Teachers Fires on Government : విజయనగరంలో సైతం సీపీఎస్ జీపీఎస్ లను రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపడుతున్న దీక్షలను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండిగా వ్యవహరిస్తుందని, తగిన గుణపాఠం చెప్తామని నిరసనకారులు హెచ్చరించారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.