NCLT on YS Jagan Petition : షేర్ల బదిలీ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఎన్సీఎల్టీ విచారణ చేపట్టింది. గతేడాది జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో సరస్వతి కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మరోసారి ఎన్‌సీఎల్‌టీ మరోసారి విచారణ జరిపింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలుకు విజయమ్మ తరఫు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.
సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద, భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరున ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, జనార్ధన్‌రెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారిపై కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో తమకు మొత్తం 51.01 శాతం వాటా ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత సరస్వతీ పవర్లో జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతి డైరెక్టర్‌గా ఉన్న క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి మొత్తం రూ.1.21 కోట్లకు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు. షర్మిళ తరఫున విజయమ్మ తన పేరు మీద షేర్లు బదిలీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈడీ, సీబీఈ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలకున్నట్లు వివరించారు.
YS Jagan Shares Issue : ఆ తర్వాత ఇరువురి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఆస్తి తగాదాలు తలెత్తాయి. షేర్లకు సంబంధించి ఎంవోయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ పిటిషన్‌లో తెలిపారు. తనకు తెలియకుండానే షేర్ల బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు కూడా లేకుండానే వాటి బదిలీ జరగిందన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట 51.01 శాతం యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌సీఎల్‌టీని కోరారు.
చెల్లి ప్రేమ ఉత్తదే - సాక్ష్యాలివిగో!
అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్‌కు షర్మిల కౌంటర్