వేటకు వెళ్దాం రా! అని చంపేశారు- పాతకక్షలకు యువకుడు బలి - నాటు తుపాకి కాల్పుల్లో యువకుడు మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 6:08 PM IST
Two Were Arrested In Murder Case: పాతకక్షలతో సమీప బంధువులే పథకం ప్రకారం హతమార్చిన ఘటన కలకలం సృష్టిస్తుంది. మనవాళ్లే కదా అని అనుకున్నాడు. వారితో వెళ్తే ఈరోజు జీవనం గడిచిపోతుంది కదా అని నమ్మి వారి వెంట వెళ్లిన పాపానికి దారుణ హత్యకు గురై మృతదేహంలా తిరిగి వచ్చాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను కంట తడి పెట్టిస్తుంది.
జిల్లాలో బంగారుపాళ్యం మండలం ఎగువకంతల చెరువుకు చెందిన యువకుడు ఉమాపతి నాటు తుపాకి కాల్పుల్లో మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు ఉమాపతి సమీప బంధువులు అయిన నాగరాజు, పాండ్యన్, వెంకటేశ్ ఉమాపతిని పాతకక్షలతో హతమార్చినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారం ఉమాపతిని హతమార్చడానికే వేట పేరుతో అడవికి తీసుకెళ్లి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన నాగరాజు, పాండ్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.