వైసీపీ-టీడీపీ కార్యకర్తల మద్య తీవ్రఘర్షణ.. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా..
🎬 Watch Now: Feature Video
clash between two groups: నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లి గ్రామంలో కూలి డబ్బుల కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనా ఇరువర్గాల కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులు ఘర్షణను నియంత్రించలేక పక్కకు తప్పుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ కూలీల డబ్బులు ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రుడు కుమారుడు సుదీర్ని అడగగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుధాకర్ పై సుదీర్ చేయి చేసుకున్నారు. ఇదే విషయమై సుధాకర్ ఇంటికి వెళ్లి తన బంధువులకు చెప్పారు. సుధాకర్ బంధువులు రామచంద్రుడుని గొడవ విషయంపై అడగడానికి వెళ్లగా... ఇరు వర్గాల మధ్య మరోసారి వాగ్వాదం నెలకొంది. గొడవ జరిగిన అనంతరం సుధాకర్ ఇంటి పైకి రామచంద్రుడు వర్గం వారు వచ్చి రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో సుంకన్న అనే వ్యక్తి తలకు, చేతికి గాయాలు అయ్యాయి. మరో వర్గానికి చెందిన రాజు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరిని వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఘర్షణలను ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.