జగన్ పేరును బాదుడు, దంచుడు రెడ్డిగా మార్చుకుంటే మంచిది: తులసిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy Allegations on Jagan About Taxes and Charges: జగన్ తన పేరును బాదుడు, దంచుడు రెడ్డిగా మార్చుకుంటే మంచిదని పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ధరలు, పన్నులు, చార్జీలు పెంచనే పెంచం, ఇంకా తగ్గిస్తామని జగన్ పాదయాత్రలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి 19 వేల 880 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజలపై జగన్ మోపాడని ఆరోపించారు.
ఆర్టీసీ చార్జీల పేరుతో రూ.5 వేల 243 కోట్లు, కరెంటు చార్జీలు ద్వారా రూ.24 వేల 856 కోట్లు, ఇసుక ద్వారా రూ.4 వేల 200 కోట్లు, మద్యంతో రూ.34 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై జగన్ మోపాడని ఆరోపించారు. జగన్ చేసే పనులు పిల్లోడికి చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇలా అన్నిరకాలు పన్నులు, ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారాన్ని మోపారని తులసి రెడ్డి వివరించారు.