అధికారుల అండతో 500 ఎకరాల ఆక్రమణకు రంగం సిద్దం - ఆందోళనకు దిగిన గిరిజనులు - Encroachment of Podu lands in Eluru district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 8:11 PM IST
Tribals Protest Against Encroachment of Podu Lands: పోడు భూమిని అధికారుల అండదండలతో కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ ఏలూరు జిల్లాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని జీలుగుమిల్లి మండలం కేంద్రం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా చేపట్టారు. మండలంలోని నారాయణపురంలో 30 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న సుమారు 500 ఎకరాల పోడు భూమిని అధికారుల అండదండలతో కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ గిరిజనులు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకు దిగిన గిరిజనులు హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా కొందరు పోడుభూముల్లో కట్టడాలు నిర్మిస్తున్నారని, పీసా చట్టాలను కూడా తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ కర్మాగారం నిర్మాణానికి గ్రామ సభ నిర్వహించినా గ్రామ ప్రజలందరూ ముక్తకంఠంతో దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కర్మాగారం నిర్మాణం నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆదివాసి సంఘం నాయకులు అనంతరం ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు.