TNTUC president fire 'కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో కొందరినే ఎందుకు రెగ్యులరైజ్ చేశారు..' - వైఎస్ జగన్ పాలనపై పబ్లిక్ టాక్ న్యూస్
🎬 Watch Now: Feature Video
TNTUC RaghuramaRaju fire on YCP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించినట్టు సాక్షి మీడియా విష ప్రచారం చేస్తోందని టీఎన్టీయూసీ(తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘు రామరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్ష మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులండగా వారిలో కేవలం 10,117మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేశారని.. ఇదేనా వారిని ఉద్ధరించడం..? అని ఆయన ప్రశ్నించారు. 2.50 లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటే, సీఎం జగన్ లక్ష మందినే ఆప్కాస్ విధానంలోకి ఎందుకు మార్చారో చెప్పాలని ఆయన అన్నారు. రెగ్యులర్ చేస్తారని ఎంతో ఎదురుచూసిన కార్మికుల ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. జగన్ పాలనతో విసిగిపోయిన కార్మికులు, ఉద్యోగులు.. 10 తలల రావణుడు కూడా ఈ ముఖ్యమంత్రి ముందు దిగదుడుపేనని అంటున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులకు మంచి రోజులు వచ్చి.. వారి జీవితాలు సంతోషంగా ఉండాలంటే.. అది చంద్రబాబుతోనే సాధ్యమని రఘురామరాజు అన్నారు.