ఎంపీ స్థాయిని మరిచి కేశినేని వీధి రౌడీలా ప్రవర్తించారు- దేవదత్ - Devadath Fires Kesineni
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 10:30 AM IST
Tiruvuru Incharge Devadath Fires on Kesineni Nani: దళితుడైన తనకు కేశినేని నాని కనీస మర్యాద కూడా ఇవ్వలేదని తిరువూరు నియోజకర్గ ఇంఛార్జి దేవదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లెక్సీల్లో ప్రోటోకాల్ పాటించలేదని వీరంగం సృష్టించిన కేశినాని నాని తన విషయంలో చాలా సార్లు ప్రోటోకాల్ తప్పారని, తనకు నాని బహిరంగ సభల్లో ఎన్నిసార్లు ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నిసార్లు అవమానించినా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే ఇన్ని రోజులు సంయమనం పాటించామని దేవదత్ తెలిపారు.
Kesineni Nani Didnt Give Respect To Dalits: దళిత నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గ ఆఫీస్లో ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదని ఫ్లెక్సీ చించేసి కేశినేని నాని వీరంగం సృష్టించటం తెలుగుదేశం పార్టీకి తీరని మచ్చ అని దేవదత్ మండిపడ్డారు. ఎంపీ స్థాయిని మరిచి వీధి రౌడీలా నాని ప్రవర్తించేవారని దేవదత్ అన్నారు. చంద్రబాబు దళితుల్ని ఎంతగా గౌరవిస్తున్నారో కేశినేని చూస్తూ కూడా దళిత నాయకుడు అయిన తనపై దురుసుగా వ్యవహరించడం సబబేనా అని దేవదత్ నిలదీశారు.