Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు - టిడ్కో ఇళ్లు
🎬 Watch Now: Feature Video

TIDCO Houses in Gudivada: మీ సొంతింటి కలను నెరవేర్చాం.. ఇక హాయిగా మీ ఇంట్లో ఉండవచ్చు.. గుడివాడలో టిడ్కో ఇళ్లు ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులకు చెప్పిన మాటలు ఇవి. ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందలేదు. 2 వారాలు దాటినా లబ్ధిదారుల చేతులకు తాళాలు ఇవ్వలేదు. దీంతో తమకు గృహాలను కేటాయించాలని టిడ్కో లబ్దిదారులు ఇటీవల నిరసన చేపట్టారు. గుడివాడలో 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా నిర్మాణం చేసిన టిడ్కో నివాసాల వద్ద మౌలిక వసతుల కల్పన ఇప్పటికీ పూర్తి కాలేదు. మంచినీటి, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా పనులు జరుగుతూనే ఉన్నాయి. సొంతింటి కల నెరవేరిందని ఎంతో సంబరపడ్డ పేదలు.. ఇంకొంత సమయం వేచి చూడక తప్పేలా లేదు. మరోవైపు టిడ్కో నివాసాలు.. మందు బాబులకు ఆవాసాలుగా మారాయి. ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. గుడివాడలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.