పీఎస్‌లో కానిస్టేబుల్‌పై దాడి చేసి దొంగ పరారీ - కానిస్టేబుల్‌పై దుండగుడు దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 4:33 PM IST
Thief Attack On Constable in Nellore District : నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై దుండగుడు దాడి చేశాడు. నార్త్ మోపూర్‌కు చెందిన నిందితుడు అన్నారెడ్డిపాలెంలో ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో మరో బైక్‌లో నుంచి దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకొని స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం కానిస్టేబుల్‌పై రాడ్‌తో డాడి చేసి నిందితుడు పరారయ్యాడు. దాడిలో తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Bike Robbed And Beaten Constable In Andhra Pradesh Latest : ద్విచక్ర వాహనం దొంగతనం చేసి, పెట్రోల్ అయిపోవడంతో మరో సారి చోరీకి పాల్పడుతూ పట్టుబడ్డ వ్యక్తి కానిస్టేబుల్ పై దాడి చేసి తప్పించుకునే యత్నం చెయ్యడంతో స్టేషన్‌లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే దొంగ అక్కడ నుంచి పరారయ్యాడు. నిందుతుడ్ని పట్టుకునేందుకు స్థానిక పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. కానిస్టేబుల్‌పై జరిగిన దాడి తీరు చూసిన పోలీసులు అవాక్కయ్యారు.