అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లు దొంగతనం - ఆ తర్వాత - unknown persons set fire to the Anganwadi center
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 3:01 PM IST
Theft in Thimmapuram Anganwadi then Set Fire: అంగన్వాడీ కేంద్రంలో దొంగలు పడ్డారు. గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లు ఎత్తుకెళ్లారు. ఇక వేరే సరకులు దొరకపోవడంతో అసహనానికి గురైన దొంగలు ఆ కేంద్రానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
Gas Cylinder and Eggs Stolen in Anganwadi Center: అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంగన్వాడి కేంద్రానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లను అపహరించుకుపోయారు. గ్రామ సచివాలయ సమీపంలో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రానికి అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేంద్రంలోని ఓ గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లను అపహరించుకుపోయినట్లు అంగన్వాడి కార్యకర్త గుర్తించారు. నెల మొదటివారం కావడంతో నిత్యావసరాల కోసం దొంగలు వచ్చి ఉండవచ్చని, సరుకులు ఏమీ కేంద్రంలో లేకపోవటంతో నిప్పుపెట్టి ఉండవచ్చని అంగన్వాడీ కార్యకర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు.