శ్రీకాకుళం జిల్లాలో భారీ దొంగతనం - 40 తులాల బంగారు ఆభరణాలు, రూ 4 లక్షల నగదు - నరసన్నపేట ఇందిరానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో చోరి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 10:55 AM IST
Theft in Doctor Couple House: శ్రీకాకుళంలో జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతానికి వెళ్లిన వైద్య దంపతుల ఇంట్లో జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నరసన్నపేట, ఇందిరానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో గురుదేవ్ - రేణుక దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వారు ఇంటికి తాళం వేసి సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. రేణుక దంపతులు ఊరెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో గుర్తు తెలియని దుండగుడు వారి ఇంటి వద్ద కదలాడిన దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.