Guntur Municipal Council meeting: గుంటూరు కౌన్సిల్ సమావేశం రసాభాస.. అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం - మెగా కంపెనీ పైపులైన్
🎬 Watch Now: Feature Video
Guntur Municipal Council meeting: గుంటూరు నగరపాలక కౌన్సిల్ సమావేశంలో రసాభాసగా మారింది. మెగా కంపెనీ పైపులైన్ పై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పైపులైన్ ఎవరు వేశారంటూ కార్పొరేటర్ శ్రీను ప్రశ్నించడం గొడవకు కారణమైంది. ఇదే విషయంపై వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాలకు ఎమ్మెల్యే గిరి, డిప్యూటీ మేయర్ వజ్రబాబు సర్ది చెప్పారు. అయినా, ఇరుపార్టీల కార్పొరేటర్లు వెనక్కి తగ్గలేదు. ఒకరినొకరు నిందించుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
సమావేశంలోకి ఐ ప్యాక్ సభ్యుల రాకతో.. ఇదిలా ఉండగా.. ఐ ప్యాక్ సభ్యులు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలోకి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశ మందిరంలో వైఎస్సార్సీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశానికి ఐ-ప్యాక్ సభ్యులు వచ్చారంటూ ఆందోళన చేపట్టిన టీడీపీ కార్పొరేటర్లు.. వారిని బయటకు పంపించారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లను డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడ్డుకోగా ఇరు వర్గాల నడుమ వాగ్వాదం నెలకొంది.