Public fire on MLA : కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
YCP MLA Jaradoddi Sudhakar Faced Protest : వైఎస్సార్సీపీ ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి జగనన్నకు చెబుదాంకు కొనసాగింపుగా 'జగనన్న సురక్ష' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ నాయకులకు నిరసన సెగలు తప్పటం లేదు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ బాబుకు జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. తమ సమస్యలపై నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. సభ జరుగుతుండగా కోడుమూరులో తాగునీటి సమస్య తీర్చాలని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సీపీఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నేతలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నిరసన కారులను పోలీసులు అదుపుచేశారు. ఎమ్మెల్యే స్పందించి మాట్లాడుతూ.. ఏళ్లుగా పాలించిన వాళ్లు కోడుమూరును అభివృద్ధి చేయలేదని, తాను సీఎంతో మాట్లాడి కోడుమూరుకు 25కోట్లతో సమ్మర్ స్టోరేజ్ మంజూరు చేయించాను ఎమ్మెల్యే అన్నారు.