Child tied to the Gate: స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని.. పిల్లల్ని గేటుకు కట్టేసి - AP TOP NEWS TODAY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18537072-1068-18537072-1684418071411.jpg)
Parents Complaints On SLV Convention Gated Community Administrators: విజయవాడలోని రామవరప్పాడు వద్ద స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని ఇద్దరు పిల్లలను కమ్యూనిటీ నిర్వాహకులు గేటుకు కట్టేసి కొట్టారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మణికంఠ శ్రీనివాస్, యశ్వంత్ ఇద్దరు కలిసి రామవరప్పాడు పై వంతెన సమీపంలోని ఎస్ఎల్వీ కన్వెన్షన్ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసి బయటకు వస్తున్నారు. నిర్వాహకుల సూచనల మేరకు సెక్యూరిటీ పిల్లల్ని పట్టుకుని కట్టేశారు. అనంతరం తల్లిదండ్రులను తీసుకు రమ్మని యశ్వంత్‌ని పంపించారు. కుటుంబ సభ్యులు తిడతారనే భయంతో అతడు చెప్పలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా మణికంఠ ఆచూకీ తెలియకపోవడంతో యశ్వంత్‌ను గట్టిగా నిలదీయగా జరిగిన విషయం చెప్పాడు. స్విమ్మింగ్ పూల్‌లో దిగినందుకు గేటుకి కట్టేశారని బోర్డు మీద రాసి మణికంఠ మెడలో వేశారని యస్వంత్ తెలిపాడు. వెంటనే కమ్యూనిటీ వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని సీసీ దృశ్యాల్ని తొలగించినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని పటమట పోలీసులు విచారిస్తున్నారు.