Tension Atmosphere in Rupanayak Thanda: రూపా నాయక్ తండాలో ఉద్రిక్తత.. అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 10:43 PM IST
Tension Atmosphere in Rupanayak Thanda: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన నాయకులు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తోన్న భూ కబ్జాలు, దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లూ పట్టణాలు, గ్రామాల్లో భూ కబ్జాలకు పాల్పడిన నేతలు.. తాజాగా ఓ తండాలో ఊరికి దానంగా ఇచ్చిన భూములపై కన్నేశారు. అధికారుల అండతో ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూడగా.. గ్రామస్థులంతా ఏకమై భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. దీంతో అధికారుల, భూ హక్కుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Land Owners Fire on YCP Leaders: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి రూపా నాయక్ తండాలో గతంలో రద్దు చేసిన ఇంటి పట్టాల స్థలాలకు మంగళవారం భూ సర్వే చేయటానికి అధికారులు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గతంలో రద్దు చేసిన ఇంటి పట్టాల స్థలాలకు ఎలా హద్దులు చూపుతారంటూ అధికారులను భూమి హక్కుదారులు నిలదీశారు. తమ పెద్దలు పేదల కోసం భూమిని దానంగా ఇస్తే.. దానిపై వైఎస్సార్సీపీ నాయకుల కన్ను పడిందని మండిపడ్డారు. లబ్ధిదారులకు హద్దులు చూపిస్తే తాము కూడా సహకరిస్తామన్నారు. కానీ, వైసీపీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం ఒప్పుకోమని తేల్చి చెప్పారు. దీంతో ఇరువర్గాల వాదోపవాదాలు విన్న ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ చంద్రశేఖర్.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.