Telugu Shakti President BV Ram: ''బెయిల్ ముఖ్యమంత్రి జగన్.. బెయిల్‌ను కాలరాసే చర్యలకు పూనుకున్నారు" - Telugu Shakti President BV Ram Comments
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 8:29 PM IST
Telugu Shakti President BV Ram: రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన పార్టీలు కలిశాయని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి రామ్ అన్నారు. విశాఖ జిల్లా తగరపువలస క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. బెయిల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బెయిల్‌ను కాలరాసే విధంగా చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల మాదిరిగా దాచుకుందాం.. దోచుకుందాం.. దండుకుందాం.. పెంచుకుందాం అనే సూత్రాన్ని కొనసాగింపును జనసేన చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల నిర్వాకం చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో తెలియదు అంటే నవ్వొస్తుందని వ్యంగ్యస్త్రాలు విసిరారు. హత్య కేసులో సీఎం జగన్, అవినాష్ రెడ్డిల పాత్ర ఉందని ఎవర్ని అడిగినా చెప్తారని.. అలాంటిది పోలీసులకు ఇది కనిపించటం లేదా అని విమర్శించారు. ఈ నెల 17వ తేదీన తెలుగుశక్తి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.