Nakka Anandbabu comments: విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్ కాదా..? : టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు - బిస్మిల్లాబాత్
🎬 Watch Now: Feature Video
Nakka Anand babu comments : ప్రాథమిక విద్యను కమీషన్ల కోసం భ్రష్టు పట్టించి, ఉన్నత విద్యను నిబంధనల పేరుతో పేద విద్యార్థులకు దూరం చేసిన ముఖ్యమంత్రి.. వారు ప్రపంచాన్ని ఏలాలని చెప్పటం విడ్డూరంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా పర్యటనపై.. విద్యా కానుక పథకం ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు డిజిటల్ తరగతులు వంటి సాంకేతికతను తెచ్చింది చంద్రబాబు అని గుర్తు చేశారు. జీవో నంబర్ 77 తెచ్చి పేదలకు ఉన్నత విద్యను దూరం చేశారని, విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఆపేశారని... నాడు, నేడు పేరుతో బడులకు రంగులు వేసి దోచుకున్నారని, బైజుస్ కంటెంట్ పేరిట కమీషన్లు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 8 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేసి, 8 లక్షల మంది పిల్లలను బడికి దూరం చేసి... ఏదో ఉద్దరించినట్లు సీఎం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మైకు దొరికింది కదా అని పిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడతారా అని ప్రశ్నిస్తూ.. విద్యా కానుక ప్రారంభంలో పిల్లల వద్ద చంద్రబాబుని తిట్టి వారి మనసుల్లో విష బీజాలు నాటాలని చూడటం దుర్మార్గమన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, పిల్లల్ని తోడు రమ్మంటారా అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోను బిస్మిల్లాబాత్, పులిహోర, కిచిడి అంటూ మాట్లాడిన సీఎం... అవన్నీ మంచి పౌష్టికాహారం కిందకు వస్తాయన్న విషయం గుర్తించాలన్నారు.