Jagananna Suraksha: పిలిచి అవమానిస్తున్నారు.. ఎమ్మెల్యేను నిలదీసిన ఎంపీపీ, సర్పంచ్​ - కోనసీమ జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2023, 1:42 PM IST

TDP MPP Burst on MLA Kondeti Chittibabu : ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే చాలు గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో నిండిపోతుంది. జనాలను కార్యక్రమాలకు తరలించాడానికి అష్టకష్టాలు పడుతుంటారు. అది పార్టీ కార్యక్రమం అని భావించి నానా హంగామా చేస్తారు. తాజాగా 'జగనన్న సురక్ష' కార్యక్రమానికి తమను పిలిచి కించపరిచే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించారని టీడీపీ ఎంపీపీ, సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, తమను అధికారిక కార్యక్రమాలకు పిలిచి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును టీడీపీ ఎంపీపీ అంబంటి భూలక్ష్మి, సర్పంచ్ బొండాడ నాగమణి నిలదీశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన 'జగనన్న సురక్ష' కార్యక్రంలో వైసీపీ కార్యక్తలకు పని ఏమిటని.. వాళ్లకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వకుండా కించపరుస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 

ప్రొటోకాల్​ పాటించకుండా అదే వేదికపై ఉన్న తమను కించపరిచేలా గృహ సారథులు, వైఎస్సార్సీపీ నాయకులతో ద్రవపత్రాలు అందించటం ఏంటని.. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఎంపీపీ, సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేము మీకు ఎంతో గౌరవం ఇస్తున్నాం.. మీకో దండం బాబూ.. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాం.. మమ్మల్ని కించపరచవద్దు' అంటూ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే చిట్టిబాబు, అధికారులు వారిని పిలిచి.. కొన్ని ద్రువపత్రాలను వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయించటంతో శాంతించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.