రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోంది : ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

🎬 Watch Now: Feature Video

thumbnail

TDP MP Kanakamedala Ravindra Kumar Allegations on YCP: రాష్ట్రంలో ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ప్రభుత్వం స్కీములపేరుతో స్క్యాములకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారంటూ కనకమేడల ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ (Jagan) పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతోందని ఆరోపించారు.  

రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యమని కనకమేడల మండిపడ్డారు. వైసీపీ (YCP) ప్రభుత్వం ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారన్నారు. వైసీపీ దెబ్బకు జాకీ, లూలూ, రిలయన్స్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటర్ కంపెనీలు క్లోజ్ అయ్యాయన్నారు. దాదాపు 2 లక్షల ఉద్యోగస్థులు రోడ్ల పాలయ్యారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24 శాతం ఉందని, రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కనకమేడల ఆరోపించారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కనకమేడల రవీంద్రకుమార్‌ దుయ్యబట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.