కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటూ తెదేపా నేతల నిరసన - kalingapatnam lift scheme news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 4:44 PM IST

Protest Of TDP Leaders Complete Work Scheme Of Lifts: శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాలకు నీరు అందించే కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలంటూ  తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. తెలుగుదేశం నేత గోండు శంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో కళింగపట్నం  ఎత్తిపోతల పథకం పనులు 70 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా 2400 ఎకరాలకు చేకూరుతుంది. చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు ఇది ఆయకట్టుగా ఉపయోగపడుతుందని గోండు శంకర్ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని నిలదీశారు. దీంతో వేలాదిమంది రైతులు నష్టపోతున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అనడానికి  ఇదే ఉదాహరణ. టీడీపీ హయాంలో ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేసిన కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రైమెక్స్ కంపెనీతో కలిసి మళ్లీ శంకుస్థాపన చేశారు.- గోండు శంకర్‌, తెదేపా నేత

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.