విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 52 వేల బోగస్ ఓట్లు - తుది జాబితాలో సరిదిద్దుతామన్న కలెక్టర్ - ఓటర్ లిస్ట్‌పై టీడీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-11-2023/640-480-20138186-thumbnail-16x9-tdp-leaders-on-voter-list-in-visakhapatnam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 7:29 AM IST
TDP Leaders On Voter List In Visakhapatnam : ఓటర్ల జాబితాలో అవకతవకలకు అవకాశ లేకుండా, బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడాలని విశాఖ జిల్లా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జునతో కలిసి కలెక్టరేట్‌లో ప్రతిపక్షాల నేతలు సమావేశం నిర్వహించారు.
Double Entries In Voter Id Andhra Pradesh : ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ... ఓటర్ల జాబితాల సవరణలో ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేర్వేరు బూత్‌లను ఎలా కేటాయిస్తారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 52 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే... ఇప్పటికీ ఒక్క ఓటును కూడా తొలగించ లేదని విపక్ష నేతలు మండిపడ్డారు. ఎన్నికల తుది జాబితాలో వీటన్నింటిని సరిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు పారదర్శంగా నిర్వహించడంలో ఓటర్ కార్డు తప్పులు ముప్పుగా మారే ప్రమాదం ఉందని వారు అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీటిని తొలగించాలని టీడీపీ నేతలు కోరారు.