బీసీల గణన గందరగోళం - చట్టబద్దత ఏదన్న టీడీపీ నేత యనమల

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 10:12 AM IST

TDP Leaders Fire on CM Jagan : రాష్ట్రంలో చేపడతామంటున్న కులగణనకు చట్టబద్దత ఏదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) ప్రశ్నించారు. బీసీల గణన అంటూ అంతా గందరగోళం చేస్తూ, ప్రజలను అయోమయంలో పడేసి, సీఎం జగన్‌ చూస్తున్నారని విమర్శించారు. విశాఖలో తెలుగుదేశం బీసీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. రాజ్యాధికారం వల్లనే తమ హక్కులను సాధించుకోగలుగుతామని యనమల రామకృష్ణుడు అన్నారు. 

All Party Meeting Under Telugu Desam Party BC Cell in Visakha : బీసీలకు న్యాయం చేసేది టీడీపీ అని, అధికారంలోకి రాగానే చట్టబద్దంగా కులగణన చేపతామని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ బీసీలపై వివక్ష ప్రదర్శిస్తోందని, కుల వృత్తులకు అందించే సాయం పూర్తిగా కరువైందన్నారు. ఈ ప్రభుత్వ హాయాంలో బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలేనన్న ఆయన వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రం అర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమస్యలన్నీ పేదలను చుట్టుముడుతున్నాయన్నారు. 

బీసీల సంక్షేమంపై ఈ నెల 28న సదస్సు : వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగాయని వారి అభివృద్ధిని పట్టించుకోవటం లేదని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు విమర్శించారు. బీసీలపై దాడుల నియంత్రణ, బీసీల సంక్షేమంపై ఈ నెల 28న గుంటూరులోని ఎన్జీవో కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుక వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.