TDP Leader Yanamala Ramakrishnudu Fires on CM Jagan: "బీసీల జనగణనపై జగన్ నిర్లక్ష్యం..టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల అభివృద్ధికి కృషి చేస్తాం"
🎬 Watch Now: Feature Video
TDP Leader Yanamala Ramakrishnudu Fires on CM Jagan : బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే బీసీల జన గణనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బీసీలకు తీరని ద్రోహం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ హయాంలో శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఇప్పటి వరకు ఆమోదంపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ప్రశ్నించారు. దిల్లీ పర్యటనలు (CM Jagan Delhi Tours), బీసీ జనగణన గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
సీఎం జగన్‌కి బీసీల అభివృద్ధి ఇష్టం లేకే బీసీల జనగణనపై నిర్లక్ష్యం (Jagan Neglects BC Census) చేస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బీహార్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జనగణన మొదలు పెట్టి పూర్తి చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్రమ కేసులు, వేధింపులతో జగన్ మునిగి తేలుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం మహానాడులో కూడా బీసీ జనగణనపై తీర్మానం చేయడం జరిగిందని, బీసీ జనగణనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పని చేస్తుంటే పెత్తందార్ల కోసమే వైసీపీ పని చేస్తోందన్నారు.
బీసీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చి 139 కులాలకు తెలుగుదేశం సమన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో కేటాయించిన నిధులను దారి మళ్లిస్తూ పెత్తందారులకు కాపలాదారుడిగా మారాడని యనమల ఆరోపించారు. బీసీల అభ్యున్నతి కోసం మురళీధర్ రావు కమిషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, చేతి వృత్తిదారులకు ప్రోత్సాహం, బీసీలకు సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ స్టడీ సర్కిళ్లు, బీసీలకు విదేశీ విద్య, ఆదరణ వంటి పథకాలకు టీడీపీనే శ్రీకారం చుట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ జనగణన చేపట్టి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు.