TDP Leader Yanamala RamaKrishnudu Fire on CM Jagan: 'ఆధారాల్లేని స్కాములతో అరాచకాలు.. సీఐడీతో చిలుక పలుకులు.. ప్రజా సమస్యలు పట్టవా?' - ap skill development case updates today

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 1:16 PM IST

TDP Leader Yanamala RamaKrishnudu Fire on CM Jagan : రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. చంద్రబాబును అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు చెప్పించి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు, నిత్యావసర ధరలు, పన్నుల భారం, నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత.. ఇవేవీ జగన్ ప్రభుత్వానికి కనపడవా అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొన్నారని దుయ్యబట్టారు. 

Yanamala RamaKrishnudu on AP Skill Development Case : అసెంబ్లీలో తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతోనే జగన్ వ్యవహరిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏనాడూ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు (AP Skill Development Case) సంబంధం ఉన్న నీలం సహాని, అజయ్ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావులను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. సీఐడీ.. కోర్టులను అబద్ధపు వాదనలతో నమ్మించాలని చూస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చందమామ కథలు అల్లుతూ సీఐడీ చేత చిలక పలుకులు పలికిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.