దొంగ ఓట్లతో గద్దెనెక్కేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు: వంగలపూడి అనిత - ఏపీలో ఓట్ల అవకతవకలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 9:33 PM IST
TDP Leader Vangalapudi Anitha Comments on jagan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తెలిసి సీఎం జగన్ దొంగ ఓట్లతో గద్దెనెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ మేరకూ ఆమె పాయకరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్ట్‌లోని వివరాలను పరిశీలిస్తే... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు కనిపిస్తుందని అనిత ఆరోపించారు.
కేవలం పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 8 వేల మంది మరణించినట్లు.. గతంలో అధికారులు ఎన్నికల సంఘానికి తెలిపారని... ఆ ఓట్ల తొలగింపు మాత్రం జరగలేదని అనిత ఆరోపించారు. సచివాలయ బీఎల్వోల సహాయంతో టీడీపీ సానుభూతిపరులు, తెలుగుదేశం నాయకులు ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు అనిత వెల్లడించారు.