పెళ్లికానుక ఎగ్గొట్టేందుకే అనవసర నిబంధనలు: పీతల సుజాత - పెళ్లికానుక పథకంపై టీడీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 8:02 PM IST
TDP Leader Peethala Sujatha Comments: పెళ్లికానుక పథకం ఎగ్గొట్టడానికే జగన్ రెడ్డి అర్థంపర్థం లేని నిబంధనలు పెట్టారని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. వధువు పదో తరగతి చదవాలంటున్న జగన్ రెడ్డి.. విలీనం పేరుతో రాష్ట్రంలో 15వేల పాఠశాలలు ఎందుకు మూసేశాడని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ 10 లక్షల కోట్లకు పెరిగినా నాలుగేళ్లపాటు పెళ్లికానుక పథకం సమగ్రంగా ఎందుకు అమలు చేయలేదో జగన్ రెడ్డి చెప్పాలన్నారు. పెళ్లికానుక పథకం తాలూకా 4లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని జగన్ రెడ్డి తక్షణమే పరిష్కరించాలని పీతల సుజాత డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ మహిళలు ఛీకొడతారన్న భయంతోనే హడావుడిగా పెళ్లికానుక పేరుని వైఎస్ ఆర్ షాదీతోఫాగా మార్చి మొక్కుబడి అమలుకు పరిమితమయ్యాడని దుయ్యబట్టారు. మహిళల కోసం చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పూర్తిగా అటకెక్కించిన జగన్ రెడ్డి.. సిగ్గులేకుండా అక్కాచెల్లెమ్మలను ఆదుకుంటున్నానని చెబుతున్నాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని వంచించిన జగన్ రెడ్డికి ఆయా వర్గాల మహిళలే వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని పీతల సుజాత అన్నారు.