TDP Leader Paritala Sunitha on CBN : చంద్రబాబు రిమాండ్​లో ఉన్నా రాష్ట్రం గురించి ఆందోళన చెందుతున్నారు: పరిటాల సునీత - TDP protests in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 7:48 PM IST

Relay Hunger Strike by Telugu Youth in Kalyanadurgam: పిచ్చోడి చేతిలో రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన టీడీపీ అధినేత చంద్రబాబు ఉందని.. మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రిమాండ్​లో ఉన్నా కూడా రాష్ట్రభవిష్యత్ పైనే చంద్రబాబు కలత చెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ (TNSF) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆమె సంఘీభావం తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి చంద్రబాబును కలిసినప్పుడు తన మనవడి గురించి అడగలేదని.. రాష్ట్ర ప్రజలనే అడిగారని పరిటాల సునీత చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల అండ ఉందని తెలిపారు. సీఐడీ అధికారులు తమ మనస్సాక్షిని చంపుకొని అక్రమ అరెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. కేవలం ప్రభుత్వం ఒత్తిడితోనే చంద్రబాబుపై కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. వంటింటికే పరిమితమైన మహిళల సైతం చంద్రబాబు కోసం నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి వస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.