TDP Naseer Ahmad On Medical Seats: 'పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కలపై జగన్ నీళ్లు చల్లారు' - Sale of MBBS seats in government colleges
🎬 Watch Now: Feature Video
TDP Leader Naseer Ahmad On Medical Seats : ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మెడికల్ సీట్లు అమ్ముకోవాలన్న జగన్ ఆలోచన దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేలా ముఖ్యమంత్రి జీవో నెం. 108 తీసుకొచ్చారని విమర్శించారు. తమ పిల్లల్ని డాక్టర్లను చేయాలని కలలుగంటున్న పేద, మధ్య తరగతి వర్గాల ఆశలపై నీల్లుచల్లేలా జగన్ రెడ్డి జీవో ఉందని ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి, డబ్బున్న వారికే వైద్య విద్య అనేలా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటే, భవిష్యత్లో ఎలాంటి డాక్టర్లు వస్తారో, ప్రజల ప్రాణాలు ఎలా గాల్లో కలుస్తాయో జగన్కు తెలియదా అని నిలదీశారు. సీట్లు కొని ఎంబీబీఎస్ చదివేవారు పేదలకు ఎలాంటి వైద్యసేవలు అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని తెలిపారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు అదనంగా సాధించలేని జగన్ రెడ్డి, ఏ ముఖం పెట్టుకొని ఉన్న సీట్లు అమ్ముతానంటున్నాడని నసీర్ అహ్మద్ ప్రశ్నించారు.
TAGGED:
Medical Colleges in AP