TDP Leader Kollu Ravindra Fire on Police Notices: పవన్‌కు పోలీసుల నోటీసులపై కొల్లు రవీంద్ర ఆగ్రహం - TDP Leader Kollu Ravindra news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 6:59 PM IST
TDP Leader Kollu Ravindra Fire on Police Notices: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా నోటీసులు జారీ చేయడంపై.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే వైసీపీ రౌడీమూకలు వారాహి యాత్రపై కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకుని.. తన వద్దనున్న సమాచారంతో పోలీసులకు సమాచారం ఇస్తే.. తిరిగి పవన్ కల్యాణ్‌కే నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు.
Kollu Ravindra Comments: 'వారాహి యాత్ర' పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ మాట్లాడుతూ.. పెడన సభలో రాళ్ల దాడికి పాల్పడేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్‌ను దింపారనే సమాచారం ఉందని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా నోటీసులు జారీ చేశారు. దాడులపై సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పోలీసులు వ్యవహరించిన తీరు.. పెడన సభలో కూడా అనుసరిస్తారనే అనుమానాలు ఉన్నాయని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పెడనలో వైసీపీ రౌడీలు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపితే.. పోలీసులు ఏం బదులిచ్చారని నిలదీశారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల సహనాన్ని ఆసరాగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.