ఎమ్మెల్యేలను కాదు-జగన్‌నే మార్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: కాలవ శ్రీనివాసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 4:52 PM IST
|Updated : Jan 6, 2024, 5:33 PM IST
Kalva Srinivas on Ministers, MLAs Transfers: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కాదు, జగన్‌నే మార్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే, వైఎస్ జగన్ తప్పులు లక్ష దాటాయని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీలు వారి డిమాండ్లను నేరవేర్చాలని సమ్మె చేస్తుంటే, జగన్ ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమని కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kalva Srinivas Comments: అనంతపురంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''వంద రోజులు ప్రభుత్వాన్ని నడపాల్సిన అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేల బదిలీలతో నైతికంగా చతికిలపడిపోయింది. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, ముఖ్యమంత్రినే. తాడేపల్లి ప్యాలెస్‌కు సెల్యూట్ చేసేవారు ఒకరైతే, నేను ఎన్నికల్లో పోటీ చేయనని మరోకరు ప్రకటనలు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చేసిన తప్పులు, అక్రమాలు జగన్ మోహన్ రెడ్డిని చుట్టుముట్టాయి. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణం. వేలాది మంది అంగన్‌వాడీలు రోడ్లమీదకు వచ్చి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే, ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం లేదు. 100 రోజుల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తాం.'' అని కాలవ శ్రీనివాసులు అన్నారు.