ముద్రగడను కలిసిన జ్యోతుల నెహ్రూ - 'వ్యక్తిగత మద్దతు కోసమే' - Mudragada Padmanabham
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 6:09 PM IST
TDP Leader Jyothula Nehru Meets Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్నానాభంను తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జ్యోతుల వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ భేటీకి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ స్వగ్రామం ఇర్రిపాకలో నిర్వహించే కోటి శివలింగార్చన పూజలకు ముద్రగడను ఆహ్వానించినట్లు నెహ్రూ తెలిపారు.
రాజకీయంగా తన కోసం మాత్రమే వచ్చానని పేర్కొన్నారు. తప్పకుండా తనకు మద్దతిస్తానని ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ అన్నారు. టీడీపీ అధిష్ఠానం ముద్రగడ వద్దకు వెళ్లమని తనకు చెప్పలేదని నెహ్రూ చెప్పారు. ఇది తన వ్యక్తిగతం మాత్రమే అని పార్టీకి సంబంధించిన విషయం కాదు అని స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ముద్రగడ చెప్పలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముద్రగడను పలు పార్టీలు సంప్రదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారా, వస్తే ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై క్లారిటీ రాకపోవడంతో మరికొన్ని రోజులు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది.