Ganta On Women Commission: జనసేనానికి మహిళా కమిషన్ నోటీసులు.. తప్పుబట్టిన టీడీపీ కీలక నేత - Ganta Comments on Gram Volunteers Controversy
🎬 Watch Now: Feature Video
Ganta srinivasa Rao React on Grama Volunteer Controversy Issue : గ్రామ వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంత మంది వైఎస్సార్సీపీ నేతల ద్వారా దుర్వినియోగం అవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ తమకు క్షమాపణ చెప్పాలంటూ గ్రామ వాలంటీర్లు రోడ్లు ఎక్కారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు.
వాలంటీర్లపై పవన్ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని గంటా తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులతో పాటు ఏకంగా ముఖ్యమంత్రే ఇష్టానుసారం మాట్లాడితే కనీసం స్పందించని మహిళా కమిషన్.. పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం కార్యక్రమానికి మద్దతుగా విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో టీడీపీ నేతల ర్యాలీలో గంటా పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని, కానీ లోకేశ్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చిన 2000 కిలో మీటర్లు పూర్తి చేయడం సాధారణ విషయం కాదని గంటా శ్రీనివాసరావు అన్నారు.