రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం లేదు - వైసీపీ నాయకులకు చిత్తశుద్ది లేదు : బీటెక్ రవి - AP Latest News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 7:33 PM IST
TDP Leader BTech Ravi Allegations on YCP Govt: సాగునీరు లేక పులివెందుల, వైఎస్సార్ జిల్లా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టడం లేదని తెలుగుదేశం నేత బీటెక్ రవి విమర్శించారు. పులివెందుల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో పులివెందుల పార్టీ ఇన్చార్జ్ బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించి రైతులు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో కరవు తాండవిస్తున్నా ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే పులివెందుల నియోజకవర్గంలో కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల తప్పిదమేనని దుయ్యబట్టారు.
రైతుల పట్ల వైసీపీ నాయకులకు, అధికారులకు చిత్తశుద్ది లేదన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరువు మండలాలు ప్రకటిస్తే రైతులకు కొంతైనా న్యాయం జరుగుతుందని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను రౌడీ షీటర్ల పేరుతో వేధిస్తున్నారన్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ పేరు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుందని ఆరోపించారు. పోలీసుల తీరు సరైంది కాదని విమర్శించారు.